పోలీసునంటూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసకు చెందిన వినోద్ కుమార్ (28) కొన్నాళ్ల క్రితం బస్సులో యువతిని చూసి.. పొడుగ్గా ఉన్నావు, పోలీసు ఉద్యోగానికి పనికి వస్తావని మాట కలిపాడు. తనను డీఎస్పీగా పరిచయం చేసుకొని, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. డిగ్రీ పూర్తి చేసిన ఆమె అతని మాటలు నమ్మింది. పాల వ్యాపారం చేస్తూ కూడబెట్టిన రూ.2.70 లక్షలను బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ కేటుగాడికి ముట్టజెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఉద్యోగం రాకుండా పోతుందని చెప్పుకొచ్చాడు.
Also Read : Tamannah : తమన్నా తీసుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
కొన్ని రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో యువతికి అనుమానం వచ్చి గ్రామీణ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నకిలీ డీఎస్పీ గుట్ట బయటపడింది. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మరిన్ని విషయాలు తెలిశాయి. బాధిత యువతినే కాకుండా.. కానిస్టేబుల్ ఉద్యోగాల పేరుతో చాలా మంఇ యువతీ యువకులకు టోకరా వేసినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు వినోద్ కుమార్ ను విచారిస్తున్న పోలీసులు.. మద్యానికి బానిసై ఇలాంటి మోసలాకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు.
Also Read : Ponguleti: ఖమ్మం నడి బోడ్డునే పార్టీలో జాయిన్ అవుతా.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి