Site icon NTV Telugu

Fake Visa : విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాల మోసం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్

Visa Fraud

Visa Fraud

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలతో నిరుద్యోగులను మోసం చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాలనుకున్నారు. కానీ బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి..డాలర్లు జేబులో వేసుకోవాలో.. డాలర్లు జేబులో వేసుకోవాలి…కోట్ల రూపాయలు కూడ పెట్టాలని ఎవరైనా కలలుకంటారు.. అంతేకాదు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. విదేశాలకు కనీసం దొడ్డిదారిలోనైనా వెళ్లాలని ఆలోచిస్తారు. అమెరికాకు వెళ్లాలంటే డంకీ రూటు సైతం ఎంచుకుంటారు… యువత ఆశలను క్యాష్ చేసుకుంటున్న బ్రోకర్లు.. కుప్పలు తిప్పలుగా పుట్టుకు వస్తున్న కన్సల్టెంట్ సంస్థలు.. నకిలీ ఉద్యోగ అవకాశాలు ఆశ చూపించి మోసం..అయితే యువత ఆశలను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు.

 Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరడం వెనుక మతలబేంటి?

నిజానికి విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే అందరికీ సాధ్యపడదు. పైగా అందుకు తగ్గట్టు శిక్షణ కూడా ఉండదు. మరోవైపు ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్లాలంటే చాలా షరతులు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించి దొడ్డి దారిన అమెరికాకి పంపిస్తామంటూ కుప్పలు తిప్పలుగా కన్సల్టెంట్ సంస్థలు పుట్టుకు వస్తున్నాయి. ఈ సంస్థల మాటున మోసాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుంటున్న కొంత మంది కేటుగాళ్లు.. నకిలీ ఉద్యోగ అవకాశాలు ఆశ చూపించి నిరుద్యోగులను నట్టేట ముంచేస్తున్నారు…

సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం. అలాంటి ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నాచారంకి చెందిన నసీమా బాను , సయ్యద్ అదిల్ , ఫాతిమా, రేఖా కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. మరో ముగ్గురితో కలిసి ముఠాలా ఏర్పడి తార్నాకలో వరల్డ్ వైడ్ ఓవర్సీస్ అనే కన్సల్టెంట్స్ పెట్టారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. పలు పేపర్స్‌లో ప్రకటనలు ఇచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు తక్కువ ఖర్చుతో ఇప్పిస్తామని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేశారు…

రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంకేముంది వారి ప్రకటన చూసి చాలా మంది వాళ్లను కాంటాక్ట్ చేశారు. ఇలా వచ్చిన కొంత మంది నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేశారు. చెప్పిన మాట ప్రకారం తమ దగ్గరకు వచ్చిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినట్టు ఆఫర్ లేటర్లు, ఫేక్ వీసాలు ఇచ్చారు. అయితే వీరు ఇచ్చిన ఆఫర్ లేటర్లు, వీసాలు నకిలీవని గుర్తించిన బాధితులు తము డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక తమ అసలు రూపం బయటపడంతో చేసేదేమి లేక డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన ముఠా టైం పాస్ చేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితులు నసీం బాను, అదిల్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి ఇండియన్ పాస్ పోర్టులు, నకిలీ వీసా కాపీలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు…

Urine: రాత్రుల్లో తరచూ మూత్రం వస్తుందా..? ఈ టిప్స్ పాటించండి..

Exit mobile version