NTV Telugu Site icon

Ravibabu : ఎన్టీఆర్‌ హైట్ గురించి నిజంగా ఆ డైరెక్టర్ అంత మాట అన్నాడా.. ?

New Project (90)

New Project (90)

Ravibabu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటివో వీడియోలు ఫోటోలను తీసుకొచ్చి మళ్లీ ట్రెండ్ చేస్తుంటారు. సోషల్ మీడియా గాసిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పడం కష్టమే. నిజం, అబద్దం మధ్య ఉన్న చిన్న గీత చాలా సార్లు కనిపించకుండా పోతుంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు చాలా పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ రవిబాబు మాటలను కట్ చేసి, ఎన్టీఆర్‌ హైట్ పై వ్యాఖ్యలు చేసినట్లుగా చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజం వేరే కోణంలో ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రూఫ్ చేశారు. ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ, “అతనికి తెలుగు రాదు.. ఎక్కడి నుంచో రావాలి.. నా భుజం వరకే ఉంటాడు” అంటూ కామెంట్స్ చేశాడు. యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలను కట్ చేసి, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సీన్లను కలిపి, రవిబాబు ఎన్టీఆర్ హైట్ గురించి కామెంట్ చేశాడంటూ ప్రచారం చేశారు. ఈ ఎడిటెడ్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అసలు వీడియోను ఎన్టీఆర్ అభిమానులు బయటకు తీసుకొచ్చారు.

Read also:Modi Trump: భారత్‌తో అమెరికా అద్భుత వాణిజ్యం ఒప్పందం.. IMECపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

వాస్తవానికి రవిబాబు ఆ కామెంట్స్ బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా గురించి చేశాడు. ఒక సినిమా క్యాస్టింగ్ గురించి చెబుతూ, “ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి.. అతను తెలుగులో మాట్లాడలేడు.. నా భుజం వరకే ఉంటాడు” అని అశుతోష్ రాణాను ఉద్దేశించి చెప్పాడు. ఆ మాటలను యాంటీ ఫ్యాన్స్ కట్ చేసి ట్రోల్ చేశారు. ఈ వైరల్ ఎడిటింగ్ ఎపిసోడ్ ద్వారా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు ఎలా పుట్టుకొస్తాయో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు అసలు వీడియోని షేర్ చేస్తూ, “మొదట నిజం తెలుసుకోండి.. తరువాత ట్రోల్ చేయండి” అంటూ యాంటీ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కొంతమంది సినీ ప్రియులు కూడా, ఎడిటెడ్ వీడియోలపై నమ్మకం పెట్టుకోకుండా, వాస్తవం తెలుసుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Read also:Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!