woman raped by fake baba: ఓ దొంగ బాబా మహిళకు దెయ్యం పేరు చెప్పి అత్యాచారం చేసిన సంచలన ఘటన ముంబైలోని శాంటాక్రూజ్‌లో వెలుగుచూసింది. మహిళపై ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు శాంటాక్రూజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు.
READ ALSO: US visa review: యూఎస్‌లో ప్రమాదం అంచున 5.5 కోట్ల మంది.. కొంచెం తేడా అనిపించినా అంతే..
పరిస్థితులను ఆసరాగా మలుచుకొని..
తన భర్తతో కొనసాగుతున్న వైవాహిక వివాదంతో కలత చెందిన ఓ బాధితురాలు కలంబోలికి చెందిన అబ్దుల్ రషీద్ అబ్దుల్ లతీఫ్ షేక్ అలియాస్ బాబాజాన్‌ను కలిసింది. బాబాజాన్ తన పరిస్థితిని ఆసరాగా మలుచుకొని, తనపై చెడు దృష్టి ఉందని, తనకు దయ్యాలు, ఆత్మలు పట్టాయని వెంటనే వాటిని తొలగించాలని నమ్మబలికినట్లు బాధిత మహిళ తెలిపింది.
దొంగ బాబా మాటలు నమ్మిన మహిళ తాంత్రిక పూజలకు అంగీకరించింది. ఈక్రమంలో నిందితుడు తన వద్దకు వచ్చి చెవిలో ఏదో మంత్రం చెప్పి బిగ్గరగా ఊదాడాని తర్వాత తనకు స్పృహ లేదని తెలిపింది. తర్వాత రెండోసారి కూడా చెవిలో చికిత్స అవసరమని, లేకపోతే పట్టిన దెయ్యం వదలదని చెప్పినట్లు బాధితురాలు చెప్పింది. దొంగ బాబా చికిత్స కోసం ఖోపోలికి రావాలని చెప్పినట్లు పేర్కొంది. శాంటాక్రూజ్ వెస్ట్‌లోని హసనాబాద్ లేన్, నవీ ముంబైలోని ఖలాపూర్‌లోని మహద్‌లలో తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు కన్నీటిపర్యంతం అయ్యింది. ఆగస్టు 19న బాధిత మహిళ ఫిర్యాదు మేరకు శాంతాక్రూజ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. API తుషార్ సావంత్ నేతృత్వంలోని బృందం నిందితుడిని నవీ ముంబైలోని కలంబోలిలో గుర్తించి అరెస్ట్ చేసింది.
