Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake DAP Fertilizer Scam: తెలంగాణలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) అధికారులను ఆదేశించారు. మరోవైపు నకిలీ ఎరువుల తయారీ, సరఫరా వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక విచారణలో ఈ నకిలీ డీఏపీ ఎరువులు కర్ణాటకలో తయారైనట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వాటిని తెలంగాణలోని పలు జిల్లాలకు తరలించి విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా అసలైన డీఏపీ బస్తాలను పోలి ఉండేలా తయారు చేయడమే కాకుండా, వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
వికారాబాద్ జిల్లా విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్పల్లిలో 106 నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించారు. అలాగే పరిగి మండలం చిగురాల్పల్లిలో 25 మంది రైతులు మొత్తం 275 నకిలీ డీఏపీ బస్తాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
కొంతమంది రైతులు ఇప్పటికే ఈ నకిలీ ఎరువులను తమ పొలాల్లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. మంచన్పల్లిలో లభ్యమైన 106 బస్తాలు, చిగురాల్పల్లిలో గుర్తించిన 27 బస్తాలను స్వాధీనం చేసుకుని చన్గోముల్, పరిగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులు కొనుగోలు చేసిన నకిలీ డీఏపీపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో నకిలీ ఎరువుల ముఠా కొంతమంది సర్పంచ్లను అడ్డం పెట్టుకుని ఈ దందా నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు నకిలీ డీఏపీ ఎరువులను పొలాల్లో చల్లిన రైతుల చేతులకు బొబ్బలు వచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
-
ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!