NTV Telugu Site icon

Fake Certificates : మీకు అక్షరంముక్క రాకున్నా.. డిగ్రీ పట్టా ఇస్తాం..!

Fake Certificate

Fake Certificate

Fake Certificates Gang Burst at Hyderabad.

మీరు ఎలాంటి చదువు చదవకున్నా.. మీకు వెంటనే మీకు నచ్చిన విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ కావాల.. అది ఎదైనా సరే ఏ రాష్ట్రం నుంచి అయిన సరే నిముషాల్లో మీ కళ్ల ముందు ఉంటుంది…. ఏ సర్టిఫికెట్ కావాలన్నా సరే డబ్బు చెల్లిస్తే చాలు మీరు విదేశాలకు సైతం వెళ్లొచ్చు అంటూ ఆఫర్స్ ఇస్తూ మోసాలు చేస్తున్నారు… అది ఎలా అంటారా అయితే ఇది చూడండి… నగరంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అమాయకులను మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసారు సైబరాబాద్ పోలీసులు. నగరంలో నకిలీ ధృవపత్రాలను తయారు చేస్తు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 యూనివర్సిటీ లకు సంబంధించిన ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేస్తూ మార్కెట్ లో కూరగాయలు అమ్మకాలు చేస్తున్నట్లు నకిలీ మార్క్స్ మెమోలను అమ్మేస్తున్నారు.. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వీరి ఆగడాలకు కళ్లెం వేశారు.. విజయవాడకు చెందిన కోట కిషోర్ కుమార్ టీచర్ గా పని చేస్తున్నాడు.. అయితే కుటుంబ పోషణ, కూతురు అనారోగ్యం దృష్ట్యా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అడ్డుదారుల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ ధృవీకరణ పత్రాలు విక్రయించేందుకు పూనుకున్నాడు.

 

నకిలీ సర్టిఫికెట్లకు డిమాండ్ ఉందని భావించి ఎలా తయారీ చేయాలి అని చెప్పి యోచించాడు.. దీంతో క్యాంపస్ అనే పేరుతో ఓ ఇనిస్టిస్ట్యూట్ ను సైతం ప్రారంభించాడు. అక్కడ కి వచ్చే విద్యార్థులకు ఈజీగా మార్క్ మెమో ఇవ్వాలని భావించి వన్ టైం సిట్టింగ్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చేవిధంగా ఆఫర్ చేసేవాడు. దీంతో ఈ సర్టిఫికెట్లు ఎలా తయారు చేయాలనేదానిపై గూగుల్ లో సెర్చ్ చేసాడు. ఇతనికి పరిచయమైన బొక్క వెంకటేశ్వర్ రావు, కిరణ్ కుమార్, కృష్ణ కాంత్ రెడ్డి ఇలా పదునాలుగు మంది కలిసి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు ను వారి వారి అడ్రెస్ లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, ఎస్‌ఎస్‌సీ మార్క్స్ మెమో లను పోస్ట్ ద్వారా పంపేవారిని తేలింది. కొద్దీ రోజులు క్రితమే బీహార్ లో ఉన్న ఆ రాహుల్ గోష్ అనే వ్యక్తికి బీఫార్మసీ సర్టిఫికెట్లు ను పోస్ట్ ద్వారా పంపించింది ముఠా ..

తమిళనాడు, బీహార్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఇంటర్, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు అమ్మకాలు చేసినట్లు తేలింది. ఈ ముఠా మొత్తం సర్టిఫికెట్లు రెడీ చేసి టీచర్ కొట కిషోర్ కుమార్ కి పంపితే అతని వాటికి కావాల్సిన రబ్బర్ సీల్, సపోర్ట్ డాక్యుమెంట్లును సమకూర్చి ఇచ్చేవాడని తేలింది. ఇప్పటి వరకు 18 యూనివర్సిటీలకు చెందిన నకిలీ పత్రాలతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన ఇంటర్, ఎస్‌ఎస్‌సీ మార్క్స్ మెమోలు తయారు చేసి విక్రయించినట్లు తేలింది.. వీరు డిగ్రీ సర్టిఫికెట్లకు 60 వేలు, బీ టెక్ 2. 5 లక్షలు, ఒక్కో యూనివర్సిటీ సర్టిఫికెట్లకు 90 వేలు రూపాయలు అమ్మకాలు చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాలు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అడ్డదారుల్లో పొందిన పత్రాలు ఆధారంగా ఉన్నత చదువులు కోసం అబ్రాడ్ పోయారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ ముఠా నుండి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని తేలింది. నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్, 4 ఫేక్ స్టాంప్స్, కంప్యూటర్‌లు, బ్యాంక్ కార్డ్స్ , ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరిని కస్టడీకి తీసుకుంటే మరి కొన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు.