Site icon NTV Telugu

Fake Baba : బండ్లగూడలో కీచక బాబా అరెస్టు..

Delhi 10th Pass Fraudster Duped 1000 People Arrested

Delhi 10th Pass Fraudster Duped 1000 People Arrested

ఓ మహిళకు వైద్యం చేయిస్తాననే నెపంతో ఆమెపై రెండు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక బాబాను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ పేరుతో నవ వధువుపై అత్యాచారానికి పాల్పడ్డ నకిలీ బాబా మాజర్ ఖాన్.. బండ్లగూడలో యునాని మెడిసిన్ షాపు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన నెల రోజులకే నవవధువు తీవ్ర అస్వస్థత గురైంది. దీంతో.. చికిత్స నిమిత్తం మాజర్ ఖాన్ వద్దకు అత్తమామలు తీసుకువెళ్లారు. అయితే.. చికిత్స పేరుతో మహిళను వివస్త్ర చేసి మజార్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read : Virat Kohli: పాక్ ఆటగాళ్లను కోహ్లి కౌగిలించుకోవడంపై వివాదం.. గంభీర్ తీవ్ర విమర్శలు

అత్యాచారం విషయం కుటుంబ సభ్యులకు చెప్తే చంపేస్తానని బెదిరింపులు గురి చేశాడు. భర్తకు విషయం తెలిసి బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల 19వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. మాజర్ ఖాన్ నకిలీ బాబా అవతారం ఎత్తి ట్రీట్మెంట్ పేరుతో పలువురు మహిళలను యువతులను మోసం చేసినట్లుగా బండ్లగూడ, చాంద్రాయణగుట్, కంచన్‌బాగ్ సహా పలు ప్రాంతాల నుండి పలు ఫిర్యాదులు అందాయి. దాంతో.. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు.

Also Read : Roger Binney: పాక్ లో అడుగుపెట్టిన బీసీసీఐ చీఫ్

Exit mobile version