NTV Telugu Site icon

Fake Baba : నకిలీ బాబా గుట్టు రట్టు.. మహిళల నగ్న వీడియోలు తీసి

Fake Baba

Fake Baba

టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్‌ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది. దీంతో.. నకిలీ బాబా ను చంద్రయాణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బసవ కళ్యాణ్ కు చెందిన వారు. అందులో ఇద్దరు హైదరాబాద్ పాతబస్తీ సలలా ప్రాంతంలో ఉంటారు.

Also Read : Sardar Mahal : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాతబస్తీలోని సర్దార్ మహల్‌కు పూర్వవైభవం..
వీరు మహిళలను మభ్యపెట్టి వారి నగ్న చిత్రాలను, వీడియో లు తీసి మూడో వ్యక్తి మంత్రగాడు దగ్గరకు పంపిస్తారు. దీంతో సదరు మంత్రగాడు సూచించిన మేరకు మహిళను ఉన్న సమస్యలు తెలిపి వాటి నివారణ గురించి చెప్పి వారిని పంపించే వారు. ఇది తెలుసుకొన్న కొందరు సోషల్ మీడియా వాళ్ళు , సోషల్ మీడియా కు చెందిన మహిళను ఎరగా వేసి అతని దగ్గర ఉన్న సమాచారం సేకరించి చంద్రయాణగుట్ట పోలీసుల సహకారంతో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసు పర్యవేక్షణలో ఉంది.. శమేన్ ఎజాజ్ మహిళను డబ్బు కురిపిస్తా అని మభ్య పెట్టి వారిని నగ్నంగా చేసి సయ్యిద్ హుస్సేన్ అనే వ్యక్తి వచ్చి వారి చిత్రాలు , వీడియో లు ముఖాలు కనిపించకుండా తీసి గులాం అనే మంత్రగాడు అతనికి పంపటం, అతను సూచించిన విధంగా అమలు చేసే వారు. అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర 500 పైగా ఫోటోలు ఉన్నట్లు తెలుసుకొని సోషల్ మీడియా మహిళ ద్వారా ఈ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది.