Site icon NTV Telugu

IPL 2025 Mega Auction: ఢిల్లీకి ఆర్సీబీ కెప్టెన్.. బేస్ ప్రైస్‌కే కొనుగోలు

Faf Du Plessis

Faf Du Plessis

ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు కొనసాగుతుంది. వేలంగా ప్రారంభం కాగానే.. బిడ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ పేరు వచ్చింది. గత సీజన్‌లో ఆర్సీబీ జట్టును గెలిపించడంలో సాయశక్తుల పోరాడినప్పటికీ.. చివరకు సెమీస్ వరకు చేర్చాడు. ఒంటి చేత్తో కొన్ని మ్యాచ్‌లను కూడా గెలిపించాడు డుప్లెసిస్. అయితే.. ఈసారి కూడా ఆర్టీఎం (RTM) ఉపయోగించి బెంగళూరు ఈ ఆటగాడిని జట్టులోకి తీసుకుంటుందనుకుంటే.. వద్దని చేతులెత్తేశారు. దీంతో డుప్లెసిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

Read Also: IPL 2025 Mega Auction: ఈ బౌలర్లకు మెగా వేలంలో జాక్ పాట్.. భువీకి ఏకంగా..!

కాగా.. ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్, స్టార్క్ వంటి ప్లేయర్లతో బలంగా ఉంది. కాగా.. డుప్లెసిస్ తోడవ్వడంతో జట్టు బలంగా మారింది. 2024 సీజన్ లో ఆర్సీబీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ జట్టులో చేరడంలో తనకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఈ సౌతాఫ్రికా ప్లేయర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అబుదాబి టీ20 లీగ్ లో అదరగొడుతున్నాడు.

Read Also: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్

Exit mobile version