Faf du Plessis: “వాళ్లకు గంభీర్ ఒక విలన్‌లా కనిపిస్తాడు”.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faf du Plessis: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థుల దృష్టిలో గౌతమ్ గంభీర్ ‘విలన్’లా కనిపిస్తారన్నాడు. కానీ.. హెడ్ కోచ్‌గా భారత క్రికెట్‌లో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. గంభీర్ తన దూకుడు స్వభావంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతారని, నాయకుడిగా ఆయన నెలకొల్పిన ప్రమాణాలు అద్భుతమన్నాడు. జియో స్టార్ (JioStar) లో మాట్లాడిన డు ప్లెసిస్.. గంభీర్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. “గంభీర్ కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు ఐపీఎల్ టైటిళ్లను, మెంటర్‌గా 2024లో మరో టైటిల్‌ను అందించారు. కోచ్‌గా అతడి హయాంలో భారత్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ ప్రయాణంలో ప్రజలు తన గురించి జనాలు ఏం అనుకుంటున్నారో గంభీర్ పట్టించుకోలేదు. ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగడం ప్రశంసనీయం. నేను గంభీర్‌తో కలిసి ఆడలేదు, కానీ ప్రత్యర్థిగా ఆడినప్పుడు ఆయన ఎప్పుడూ కథలో విలన్‌లానే కనిపిస్తారు. అయితే ఆ విషయాన్ని మనం గౌరవించాలి. ఆయనకు ఎవరితోనూ మంచి అనిపించుకోవాలనే తపన ఉండదు, కేవలం గెలవాలనే పట్టుదల మాత్రమే ఉంటుంది. ఒక నాయకుడిగా డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంచడమే గంభీర్ పని. మంచి నాయకులు చేసేది కూడా అదే.” అని పేర్కొన్నాడు. వ్యక్తిగత ఇమేజ్ గురించి పట్టించుకోకుండా, కేవలం జట్టు విజయాల కోసమే పరితపించే గంభీర్ వంటి నాయకులు క్రికెట్‌కు ఎంతో అవసరమని డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!