ప్రస్తుత సోషల్ జమనాలో లైక్‌లు, షేర్‌లు, సబ్‌స్క్రైబ్‌లే మెయిన్. సోషల్ మీడియాలో కనిపించే ఫోటోనో, వీడియోనో వాస్తవమో.. అవాస్తవమో అని తెలియదు కానీ.. నచ్చిదంటే చాలు లైక్ కొట్టేయడం.. ఫార్వర్డ్ చేయడమే పని. అయితే.. ఇలా సామాజిక స్పృహా లేకుండా.. వైరల్ అయిన ఫోటోలు, వీడియోల ఎన్నో. అయితే.. ఇటీవల భారత్‌లో అర్థరాత్రి సూర్యోదయం అంటూ సోషల్ ప్రపంచంలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఇంకేముంది.. ఆ వీడియోను కాస్త వైరల్ చేసేశారు మన సోషల్ మీడియా వైరలిస్ట్‌లు.. చూసే వీడియోలోనో, ఫోటోలోనో ఉన్న విషయంపై అవగాహన లేకుండానే సోషల్ మీడియా ఫ్రెండ్స్ షేర్ చేశారని కదా అని మరొకరి షేర్ చేయడం.. తీరా అసలు విషయం తెలుసుకున్నాక అవునా..! ఇది నిజం కాదా అనుకోవడం పరిపాటిగా మారిపోయింది.
Also Read : Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
భారత్‌లో అర్థరాత్రి సూర్యదోయమంటూ వైరల్ అయిన వీడియోపై ఫాక్ట్ చెక్ చేయగా.. ఆ వీడియో అసలు విషయం బయటపడింది. ఈ వీడియోలో.. రాత్రి ఆకాశంలో అకస్మాత్తుగా, నారింజ రంగుతో ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. సూర్యుని వంటి వృత్తాకార వస్తువు సూర్యోదయాన్ని మాదిరిగా అర్థరాత్రి ఆకాశంలో వెలుగుతుంది. ఈ వీడియోలో భారీ సంఖ్యలో జనాలు ఈవెంట్‌ను రికార్డ్ చేయడం, వారు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం కూడా కనిపిస్తుంది. అయితే.. ఈ వీడియోను భారతదేశంలో అర్ధరాత్రి సూర్యోదయం అంటూ పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వీడియోపై ఆరా తీస్తే.. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి సంబంధించిందిగా అసలు గుట్టు రట్టైంది. దీంతో వైరలిస్ట్‌లు సైతం అవునా.. ఇది నిజమా అంటూ.. అవాకయ్యారు.
Also Read : Butta Bomma: ఆకట్టుకుంటున్న ‘బుట్ట బొమ్మ’ తొలి పాట
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన అత్యంత బరువైన రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్ 3ని అక్టోబర్ 23, 2022న ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SHARలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 12:07 గంటలకు రాకెట్ బయలుదేరింది. 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి, UK-ఆధారిత సంస్థ OneWeb భాగస్వామ్యంతో NewSpace India Limited కోసం చేపట్టిన మొదటి ప్రత్యేక వాణిజ్య ప్రయోగం. అయితే దీనికి సంబంధించిన వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను క్రింద చూడవచ్చు.
Video
