NTV Telugu Site icon

Facebook : ఫేస్ బుక్ లో 12 వేల మంది ఉద్యోగుల పై వేటు?

Mark Zuckerberg

Mark Zuckerberg

Facebook : ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగుల ఉద్యావసలకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో మాస్ లేఆఫ్స్ జరగవచ్చనే వార్త ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలని మార్క్ జుకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ చర్యల్లో భాగంగా మెటాలో పనితీరు బాగాలేని వారిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మేనేజర్లు తమ టీంలలో అలాంటి వారిలో 15శాతం మందిని గుర్తి వారికి పింక్ స్లిప్ అందించాలని జుకర్ బర్గ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఓ నివేదిక తెలిపింది. దీంతో వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోతామని భయంతో ఉన్నారు. ఈ మేరకు రాబోయే వారాల్లో లే ఆఫ్స్ కు అనుగుణంగా అడుగులు పడతాయని తెలుస్తోంది.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్ ఉద్యోగులు వర్క్‌ప్లేస్ యాప్ బ్లైండ్‌కి వెళ్లారు. అక్కడ వారు 30 రోజుల ‘నీడ్స్ సపోర్ట్’ జాబితాలో ఉంచబడిన వారు ఉద్యోగం నుండి బయటపడే అవకాశం ఉందని వారు ఊహించారు. వీరి సంఖ్య దాదాపుగా 12,000గా నిర్ణయించబడింది. ‘నీడ్స్ సపోర్ట్’ ఉద్యోగులు పనితీరు లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యే వర్గం కిందకు వస్తారు. ఈ ఉద్యోగులు పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP) క్రింద కొత్త అవసరాలకు లోబడి ఉంటారు. తప్ప వారు సంస్థలో ఇక ముందు కొనసాగడం కష్టమేనని ఫేస్‌బుక్ చీఫ్ ఇంజనీర్, మహేర్ సబా ఇటీవల పేర్కొన్నారు. వీరంతా మరో నెలలోపు వేరే ఉద్యోగం చూసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
Read Also: Vande Bharat: ప్రారంభించిన వారంలోపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‎కు యాక్సిడెంట్

తాజా నియామకాలను నిలిపివేశామని ఇటీవలే మెటా ఎర్నింగ్స్ కాల్ లో మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. మొత్తం 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడవచ్చని తెలుస్తోంది. మరోవైపు లే ఆఫ్స్ ఉంటాయంటూ ముందుగానే హింట్ ఇవ్వడంతో… చాలా మంది ఉద్యోగులు ప్రిపేర్డ్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.