NTV Telugu Site icon

Exxeella: ఈనెల 17న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం..

Exella

Exella

Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం.. ఆగస్టు 17న హైదరాబాద్‌లోని T-హబ్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో.. దక్షిణాదిలోని అత్యంత ప్రభావవంతమైన.. నిష్ణాతులైన మహిళలు, వారి సంబంధిత రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిన, సామాజిక పురోగతికి దోహదపడిన మహిళలను సత్కరించనున్నారు.

Read Also: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహిళా సంక్షేమం కోసం చట్టాలు, విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, తెలంగాణ మహిళా భద్రతా విభాగం ADGP స్వాతి లక్రా పాల్గొననున్నారు. Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ స్థాపకుడు అరవింద్ అరసవిల్లి యొక్క ఛారిటబుల్ ట్రస్ట్ క్రింద ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. సామాజిక పురోగతి, సహాయక నెట్‌వర్క్‌ను ప్రోత్సహిస్తూ.. మహిళల విజయాలను గుర్తించడానికి నిర్వహిస్తున్నారు.

Read Also: August 15 Releases: వచ్చే వారమంతా ముంబై భామలదే హవా !

కాగా.. ఈ కార్యక్రమానికి NTV డిజిటల్‌ మీడియా భాగస్వామిగా ఉండబోతుంది. Exxeella ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఒక ప్రత్యేకమైన, స్పూర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన పరిశ్రమల ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు న్యాయ నిపుణులతో సహా ప్రముఖుల కలయిక. విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులైన మహిళలు ఒకచోట చేరి తమ ఆలోచనలు స్వేచ్ఛగా, సహజ సిద్ధంగా ఉండేలా ఈ వేదికపై పాలు పంచుకోబోతున్నారు.

Show comments