NTV Telugu Site icon

Exxeella Education Group: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి అనూహ్య స్పందన

Exella

Exella

ఈనెల 5వ తేదీ ఆదివారం Exxeella Education Group ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నగరంలోని హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల హోటల్ తాజ్ డెక్కన్ నందు నిర్వహించడం జరిగింది. దీనిలో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అయిన ర్యాగా కృష్ణయ్య విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ తమని కూడా ఇటువంటి కార్యక్రమం లో భాగం చేసినందుకు సంతోషాన్ని తెలియజేస్తూ విదేశీ విద్య కోసం ప్రయత్నించే చాలా మంది విద్యార్ధులకు ఈ ఫెయిర్ ఒక అద్భుతమైన అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్ల వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

Read Also:
Viveka Case: ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ ఉన్నతమైన విశ్వవిద్యాలయాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోగలరని, విదేశాలలో చదవడం వలన చదువుతో పాటుగా విభిన్న సంస్కృతులు తెలుసుకోగలరని మన దేశం లో ఇంకా వృద్ది లోకి రాని ప్రొఫెషనల్ కోర్సులను మరియు గ్రాడ్యుయేషన్ దశలోనే నేర్చుకోవడం ద్వారా విద్యార్ధులు మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ఫెయిర్ కి విచ్చేసినందుకు కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెయిర్ లో దాదాపు 500ల మంది విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Read Also: Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు