Site icon NTV Telugu

Extramarital Affairs: అంబర్‌పేటలో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం..

Hyd

Hyd

Extramarital Affairs: మాజీ మిస్ వైజాగ్ ఘటన మొరవక ముందే.. హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య పిల్లలపై దాడికి దిగాడు. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో ఉల్లాసంగా గడుపుతుండగా అతడిని భార్య మెర్సీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తతో ఎలా ఉంటావు అని ప్రవీణ్ ను ఆయన ప్రియురాలికి గుణపాఠం చెప్పారు. ప్రియురాలిని అడ్డుకోవడంతో భార్య మెర్సీ ఆమె కొడుకుని తీవ్రంగా భర్త ప్రవీణ్ కొట్టాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: F4 : ఎఫ్ 4 కు రంగం సిద్ధం..త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ..?

కాగా, కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలుతో అంబర్ పేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య అవేదన వ్యక్తం చేసింది. భర్త చేష్టలను బయట పెట్టాలని ఈ రోజు భార్య మెర్సీ ఆమె కుమారులు రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. ప్రవీణ్ ప్రేయసికి ముందే వివాహమైంది ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా పోలీసులను భార్య మెర్సీ ఆశ్రయించింది. తను పని చేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆమె ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, సంఘటన స్థలాన్ని చేరుకున్న అంబర్పేట్ పోలీసులు.. ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version