NTV Telugu Site icon

S Jaishankar Mauritius Visit: రేపు మారిషస్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..ఈ అంశాలపై చర్చలు

S Jaishankar Mauritius Visit

S Jaishankar Mauritius Visit

ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం నుంచి మారిషస్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ పర్యటనను ప్రకటించింది. జైశంకర్ తన పర్యటనలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌తో సమావేశమవుతారు. ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్‌నాథ్‌ ఇటీవల భారత్‌కు వచ్చిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. జైశంకర్ ఇంతకుముందు ఫిబ్రవరి 2021లో మారిషస్‌ను సందర్శించారు.

READ MORE: Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..

ఈ పర్యటన రెండు దేశాలకు కీలకం..
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఈ పర్యటన భారత్-మారిషస్ సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది భారతదేశం యొక్క ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’, విజన్ సాగర్, గ్లోబల్ సౌత్ (అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు) పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బహుళ కోణాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల నిరంతర నిబద్ధతను కూడా ఈ పర్యటన పునరుద్ఘాటిస్తోంది.” అని పేర్కొన్నారు.

READ MORE: BJP MLA: పంక్చర్లు వేసుకోండి..విద్యార్థులకు ఎమ్మెల్యే సలహా! మండిపడుతున్న నెటిజన్లు

కాగా.. భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవుల మధ్య ఈ రోజు (సోమవారం) అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. 10వ మైక్రోనేషియన్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్‌ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో సందేశం ద్వారా అభినందించారు. రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్‌లో నాలుగు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ఎంఓయూపై సంతకం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. దాని సహాయంతో మార్షల్ దీవులు ఎంతో ప్రయోజనం పొందుతాయి.