NTV Telugu Site icon

TG: అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల బస్‌ పాస్‌ గడువు పొడిగింపు..ఇలా అప్లై చేసుకోండి..

New Project (20)

New Project (20)

రాష్ట్రంలోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్‌ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బస్‌ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది.

READ MORE: Semi Final Schedule: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడేది ఎవరంటే?

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కాలపరిమితి పొడిగించిన ఈ బస్‌ పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=Fresh లింక్‌ పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్‌ కార్డులను విధిగా అప్‌లోడ్‌ చేయాలి. బస్‌ పాస్‌ కలెక్షన్‌ సెంటర్‌నూ ఎంపికచేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్‌ లైన్‌ లో ధృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్‌ పాస్‌లను టీజీఎస్‌ఆర్టీసీ జారీ చేస్తుంది.