NTV Telugu Site icon

China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు

20230116155903frontphoto

20230116155903frontphoto

China Explosion : చైనా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్ అనుకోకుండా పేలుడు జరుగగా ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 34మంది తీవ్రంగా గాయపడ్డారు. 12మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన లియానింగ్‌ ప్రావిన్స్‌లోని పంజిన్‌ నగరంలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. 24 గంటల తర్వాత కూడా మంటలు ఉద్ధృతంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన హయోయ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో కొత్త యంత్రాలను అమర్చారు. దీంతో పాటు నిర్వహణ పనులు కూడా చేపట్టారు. ఫ్యాక్టరీలో తొలుత పేలుడు సంభవించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగింది.

Read Also: Swiggy Ambulance: ఇక అందుబాటులోకి స్విగ్గీ అంబులెన్సులు

మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అదుపులోకి తీసుకురావడం చాలా కష్టంగా మారింది. మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. అయితే పేలుడుకు గల కారణమేమిటో తెలియరాలేదు. ఈ ప్రమాదం తర్వాత ఫ్యాక్టరీల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, ఫ్యాక్టరీలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని చైనా ప్రజలు కోరుతున్నారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం మొదటిసారేమీ కాదు. 2019 లో పేలుడు జరగడంతో జియాంగ్సులోని పారిశ్రామిక పార్కును మూసివేశారు. ఈ పేలుడులో 78 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు.

Show comments