China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Explosion : చైనా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్ అనుకోకుండా పేలుడు జరుగగా ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 34మంది తీవ్రంగా గాయపడ్డారు. 12మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన లియానింగ్ ప్రావిన్స్‌లోని పంజిన్ నగరంలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. 24 గంటల తర్వాత కూడా మంటలు ఉద్ధృతంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన హయోయ్ కెమికల్ ఫ్యాక్టరీలో కొత్త యంత్రాలను అమర్చారు. దీంతో పాటు నిర్వహణ పనులు కూడా చేపట్టారు. ఫ్యాక్టరీలో తొలుత పేలుడు సంభవించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగింది.
Read Also: Swiggy Ambulance: ఇక అందుబాటులోకి స్విగ్గీ అంబులెన్సులు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అదుపులోకి తీసుకురావడం చాలా కష్టంగా మారింది. మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. అయితే పేలుడుకు గల కారణమేమిటో తెలియరాలేదు. ఈ ప్రమాదం తర్వాత ఫ్యాక్టరీల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, ఫ్యాక్టరీలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని చైనా ప్రజలు కోరుతున్నారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం మొదటిసారేమీ కాదు. 2019 లో పేలుడు జరగడంతో జియాంగ్సులోని పారిశ్రామిక పార్కును మూసివేశారు. ఈ పేలుడులో 78 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు.
⚠️ HAPPENING NOW: Massive explosion at a chemical plant in Panjin, Liaoning province of China. Blast heard throughout the region. pic.twitter.com/UiEcIlp4i4
— Upward News (@UpwardNewsHQ) January 15, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!