NTV Telugu Site icon

Loksabha Elections 2024: రేపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ సమయంలోనే..

New Project 2024 05 29t090031.115

New Project 2024 05 29t090031.115

లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే, ఇండియా కూటమి ఎత్తులు పైఎత్తులతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదిపాయి. ఎట్టకేలకు రేపు ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు తెరపడనుంది. శనివారం దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికలకు పోలింగ్ ముగియనుంది.

Read Also: RC 16 : రాంచరణ్ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం ..

కాగా.. ఏడో విడత పోలింగ్‌కు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాలకు సహా ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ రేపు పోలింగ్ జరుగనుంది. రేపు జరగబోయే చివరి విడత పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి.

Read Also: AP Elections 2024: ఆయనదే గెలుపు రూ.20 లక్షలు పందెం.. లేదు మా నాయకుడే.. రూ.50 లక్షలు పందెం..

ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.