NTV Telugu Site icon

Indra Re-Release: మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇట్స్ అఫీసియల్..

Indra

Indra

Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలను చూసే ఉన్నాం. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఆల్ టైం రికార్డ్ విజయం సాధించిన సూపర్ హిట్ సినిమా ‘ఇంద్ర’ ను వైజయంతి మూవీస్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Jharkhand : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. రిజర్వాయర్లలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌ కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ తెలిపింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా గుర్తుండి పోయింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు.

Show comments