దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్ లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్ధులను వారు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద వెదురుపల్లి శ్రీను వాసరావు అనే వ్యక్తి ఇంటిలోకి ఇద్దరు దుండగులు చొరబడి ఇంటిలో ఒంటరిగా టి.వి చూస్తున్న శ్రీనివాసరావు భార్యను బెదిరించి సుమారు 15కాసుల బంగారం, వెండి దోచుకువెళ్ళారు. దోపిడీ గత రాత్రి 8.30 సమయంలో జరిగింది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంద్రపాలెం పోలీసులు కాకినాడ సిఐ శ్రీనివాస్, క్రైమ్ డిఎస్పీ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
బాధితుడు శ్రీనివాసరావు గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాణా షాపులో వ్యాపారంలో బిజీగా గా ఉన్న సమయంలో పక్కన ఉన్న మెట్ల మార్గం ద్వారా ఇద్దరు దుండగులు మేడపైకి వెళ్లి తమ ముఖాలు గుర్తు పట్టకుండా మేడపైన ఆరబెట్టిన లంగాలను ముఖాలపై కప్పుకుని గదిలో ఒంటరిగా టీవీ చూస్తున్న శ్రీనివాసరావు భార్యను చంపుతామని బెదిరించి లాకర్ తాళాలు తెరిచి సుమారు 15 కాసుల బంగారం, వెండి నగలను దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్ డిఎస్పీ రాంబాబు తెలిపారు.
Read Also: RCB vs LSG : లక్నోతో పోటీకి సై అంటున్న ఆర్సీబీ