Site icon NTV Telugu

Father: తండ్రి ప్రేమ మరి..! తుపాకీతో కాల్చిన కొడుకు.. నాన్న వాంగ్మూలం చూస్నే కన్నీళ్లు ఆగవంతే..

Father

Father

Father: ఓ నాన్న.. ! నీ మనసే వెన్న , అమృతం కన్నా అది ఎంతో మిన్న.. అనే ఓ పాత పాఠ వినేఉంటారు.. 1970లో వచ్చిన ఈ పాట నేటి తరం వరకూ అంతా ఏదో సందర్భంలో.. చివరకు ప్రపంచ పితృ దినోత్సవం నాడైనా ఏదో టీవీలో.. సోషల్‌ మీడియాలో విని ఉంటారు.. అయితే, ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. ఏసీ కూలింగ్‌ విషయమై తండ్రీ కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకోగా.. కోపంతో ఊగిపోయిన కుమారుడు వెంటనే తుపాకీ తీసుకుని తండ్రిని కాల్చేశాడు.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణాలతో కొట్టుమిట్లాడుతోన్న సమయంలో.. పోలీసులకు చెప్పిన వాంగ్మూలం ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది.. అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

Read Also: Chiru: సెన్సేషనల్ డైరెక్టర్‌తో మెగాస్టార్?

పంజాబ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోషియార్‌పూర్‌ జిల్లా జలాల్‌చక్క గ్రామంలో వీర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన కుమారుడు అమర్‌సింగ్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎండలు మండుతున్నాయి.. దానికి తోడు ఇంట్లోని ఏసీ సరిగా పనిచేయడంలేదు.. చల్లనిగాలి రావడంలేదు.. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.. ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకెళ్లాయి.. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

Read Also: Devara: చిమ్మ చీకట్లో తెరకెక్కించిన ఫైట్… దేవరకే హైలైట్

ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడైన తండ్రి వాంగ్మూలం కోసం ఆస్పత్రికి వెళ్లారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు.. కోపంతో లైసెన్స్‌ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు.. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా.. అరెస్ట్‌ చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.. జర్నలిస్ట్ గగన్‌దీప్ సింగ్ ట్విట్టర్‌లో పంచుకున్న వీడియోలో, గాయపడిన తండ్రి తన చికిత్స తర్వాత ఆసుపత్రి బెడ్‌పై పడుకోవడం చూడవచ్చు. ఆశ్చర్యకరంగా, తన కొడుకుపై కాల్పులు జరిపిన తర్వాత కూడా, బాధితుడు తన కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసు అధికారులను అభ్యర్థించడం చూడవచ్చు. అయితే, ఐపీసీ, ఆయుధ చట్టంలోని హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద అమర్జీత్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తండ్రి కన్నుమూశారు.

Exit mobile version