వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు అంటే.. అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో.. రెండు రోజుల విచారణలో భాగంగా పలు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్లు సమాచారం. మరోవైపు.. రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు.
పోలీసులు వేసిన ఎక్స్టెన్షన్ రిమాండ్ పిటిషన్ పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 3 వరకు నందిగం సురేష్‌కు రిమాండ్ విధించింది. కాగా మరియమ్మ అనే మహిళ మృతి కేసులో తుళ్లూరు పోలీసులు వేసిన పిటి వారెంట్‌ను మంగళగిరి కోర్టు తిరస్కరించింది. తుళ్లూరు పోలీసులు మరియమ్మ మృతి పై మరింత లోతుగా దర్యాప్తు చేసి.. అందులో నందిగం సురేష్ పాత్ర ఏంటో స్పష్టం చేయాలని మంగళగిరి కోర్టు ఆదేశించింది.
Read Also: LG VK Saxena: ఢిల్లీలో లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు.. ముందు వీటిపై దృష్టి పెట్టండి