Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ex Mlc Adireddy Apparao And Janasena Leader Atti Satyanarayana Fires On Mp Margani Bharat

TDP and Janasena: ఎంపీ భరత్‌పై విరుచుకుపడ్డ టీడీపీ, జనసేన నేతలు.. ఆయన ఫెయిల్యూర్ హీరో..!

Published Date :March 5, 2024 , 5:00 pm
By Sudhakar Ravula
TDP and Janasena: ఎంపీ భరత్‌పై విరుచుకుపడ్డ టీడీపీ, జనసేన నేతలు.. ఆయన ఫెయిల్యూర్ హీరో..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

TDP and Janasena: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ, జనసేన నేతలు.. బహిరంగ సభలో చెప్పు చూపిస్తావా, నువ్వెంత ? నీ స్థాయి ఏమిటి? అని రాజమండ్రి మార్గాని భరత్ పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విరుచుకు పడ్డారు. వాలంటీర్ ను ప్రశ్నించడానికి నాకు అర్హత లేదా అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెపుతున్న ప్రచారంపై ఆ వాలంటీర్ ను వివరణ అడిగాననీ అప్పారావు చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి తాను అలా చెప్పడం లేదని ఫోన్ లో చెప్పుకొచ్చిందన్నారు. సోమవారం రాత్రి సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించిన రాజమండ్రి సిద్ధం సభలో ఎంపీ భరత్ చెప్పు చూపించి ఆదిరెడ్డి అప్పారావును చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యల పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, రాజమండ్రి సిటీ జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణలు త్రీవ్రంగా మండి పడ్డారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టెన్షన్ లో పడి ఎంపీ భరత్ ఏమీ మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదన్నారు అదిరెడ్డి. నీకు సంస్కారం వుందా అని భరత్ ను ప్రశ్నించారు. ఎంపీగా గెలిసిన తర్వాత ఎప్పుడైనా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లావా? ఎందుకు వెళ్లలేకపోయావు అంటూ ధ్వజమెత్తారు. రాజమండ్రి సిటీలో ఎంపీగా గత ఎన్నికలలో నీకు టీడీపీ అభ్యర్థి కంటే 28 వేల తక్కువ ఓట్లు వచ్చాయి అనేది నీకు గుర్తుందా..? అని ప్రశ్నించారు. అభివృద్ధికి పార్లమెంట్‌ నిధులేమైనా ఖర్చు చేసావా? అని నిలదీశారు. నీ అభివృద్ది ఏమిటో మెయిన్ రోడ్ చూస్తూనే తెలుస్తుందని, వ్యాపారులు అంతా వద్దంటే వేసిన సెంట్రల్ లైటింగ్ ను ఇప్పుడు తీసేస్తాను అంటున్నావు.. మరి ఆ ఖర్చు దుర్వినియోగం కాదా? అని ఆదిరెడ్డి దుయ్యబట్టారు. నీది ఫెయిల్యూర్ సినిమా అని, నువ్వు ఒక సినిమాలో నటిస్తే రెండో రోజే అగిపోయిందని విమర్శించారు. అలాగే సినిమా సెట్టింగులు లా రాజమండ్రిని మారుస్తున్నావు.. అంటూ విమర్శించారు.

ఇక, జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనాయణ ఎంపీ భరత్‌పై మండిపడ్డారు.. వాలంటీర్స్ కు మేము వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్ తో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన దానిలో తప్పేముందని నిలదీశారు. ఏడు నియోజక వర్గాలకు ఎంపీవా, రాజమండ్రి సిటీకా అని ప్రశ్నించారు.. బలుపుతో నీ తండ్రి వయస్సున్న ఆదిరెడ్డి అప్పారావును సభలో చెప్పు చూపించి కొడతానని బెదిరిస్తావా..? రౌడీయిజం చేస్తున్నావా? అంటూ ధ్వజమెత్తారు. ఇలాగే రౌడీగా వ్యవహరిస్తే బెల్ట్ దెబ్బలు పడతాయని అన్నారు. ఎంపీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఎంపీ భరత్ కార్పొరేటరా ఎంపీయో ప్రజలకు తెలియడం లేదని సెటైర్లు వేశారు.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, చేసిన అభివృద్దిపై శ్వేతపత్రం ప్రకటించాలని ఎంపీ భరత్ ను డిమాండ్ చేశారు అత్తి సత్యనారాయణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adireddy apparao
  • Andhra Pradesh
  • atti Satyanarayana
  • janasena
  • MP Margani Bharat

తాజావార్తలు

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

  • Middle East War Impact: షోరూమ్‌ల్లో దుమ్ముపడుతోన్న రోల్స్‌ రాయిస్‌, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు..

  • Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు చేస్తాం.. అమెరికన్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions