మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. కొండాపూర్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ అధికారులు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పలు అంశాలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయం వుందని ఆరోపణలున్నాయి. నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌లో వెలుగులోకి వచ్చింది ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన జరిగింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర వుందంటున్నారు. ఉదయం పరీక్ష ప్రారంభమయిన వెంటనే గిరిధర్ వాట్సప్ నెంబర్ నుంచి బయటకు వెళ్ళింది తెలుగు ప్రశ్నా పత్రం. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఉదయం 9.57కి ప్రశ్నాపత్రం లీకైంది. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన తర్వాత సీఐడీ దూకుడు పెంచింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలులో వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నా పత్రాలు బయటకు వచ్చాయి. ఈ కేసుకి సంబంధించి చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు నారాయణను తీసుకెళ్ళారు.ఇప్పటికే ఈ విషయంలో సుమారు 45 మంది ప్రభుత్వ టీచర్ల అరెస్ట్ జరగింది.
Warangal : భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు