Site icon NTV Telugu

Padala Aruna: జనసేనలో చేరిన మాజీ మంత్రి.. పవన్ సమక్షంలో చేరిక

Aruna

Aruna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. మూడో విడత వారాహి యాత్రలో పాల్గొనేందుకు వెళ్లారాయన. రెండు విడతలు విజయవంతంగా పూర్తి చేసుకుని.. మూడో విడత యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కలిసిన మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం

ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని తెలిపారు. యువతకు మేలు చేసే పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. ఈ కారణం వల్లే తాను జనసేనలో చేరానని ఆమె పేర్కొన్నారు.

Tomato Price: దిగొస్తున్న టమాటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో ధర ఎంతంటే..!

గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను అరుణ కలిశారు.

Exit mobile version