బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న గెలుపు తధ్యమని.. ఇది ఓపెన్ ఛాలెంజ్.. లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత దుమ్ము దులిపెస్తారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈరోజు ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి నివేదిత గెలువు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Read Also: Shortage of beers: రాష్ట్రంలో బీర్ల కొరత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మద్యం ప్రియులు
ఈ ఎన్నికల సర్వేలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ఈసారి మూడో స్థానంలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసిన గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, మాధవరం కృష్ణ రావు, వివేకనంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఉప ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.