Site icon NTV Telugu

Balineni Srinvas Reddy: నేను టికెట్స్ ఇప్పించినవాళ్ళే నాపై ఫిర్యాదు చేశారు

Balineni Srinivas Reddy

Balineni Srinivas Reddy

ఏపీ రాజకీయాల్లో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే పై కూడా సీఎంకి ఫిర్యాదు చేయలేదు..మూడు జిల్లాలు తిరుగుతూ సొంత నియోజకవర్గ కార్యక్రమాలకు సమయం కేటాయించడం కుదరటం లేదనే కో ఆర్డినేటర్ బాధ్యతలు వద్దని చెప్పానన్నారు బాలినేని. నేను టికెట్స్ ఇప్పించిన వాళ్ళే నాపై ఫిర్యాదులు చేయిస్తున్నారు..వాళ్ళతో కావాలనే కొందరు అలా చేయిస్తున్నారు..నాకు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు..

Read Also: Mallikarjuna Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. నాదే పూర్తి నైతిక బాధ్యత

జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులు చూడలేకపోతున్నాను…కావాలనే నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. నాపై ఆరోపణల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు..అన్నిటికీ అధిష్టానం పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నా అన్నారు. నా కార్యకర్తల కోసం నా రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడ్డా వాళ్ల కోసం వెనుకే ఉంటా..పార్టీ మీద ప్రేమ లేని వెధవలు పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారు. అన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయి.. వాళ్ల మీద చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా అన్నారు బాలినేని. ఇటీవల ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

Read Also: Balineni Srinivas Reddy: విలువలతో కూడిన రాజకీయం నా ఎజెండా

Exit mobile version