NTV Telugu Site icon

Clashes in TDP : ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గీయుల దాడీ

Nandyala

Nandyala

నంద్యాల జిల్లా టీడీపీలో మరొసారి విభేదాలు భగ్గుమంటున్నాయి.. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆదే పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి.

Also Read : IPL 2023 : 10 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ ఎంతంటే..?

నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతుంది. ఈ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే, అఖిలప్రియ వర్గానికి చెందిన కొందరు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఆయన గాయాలు అయ్యాయి. లోకేష్ ముందే ఈ దాడి జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడి చేయడంపై ఏబీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు. మరోవైపు, ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పడంతో.. పాదయాత్ర నుంచి సుబ్బారెడ్డిని పోలీసులు పంపించారు.

Also Read : Nitin Gadkari: నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు కాల్..

మరి నంద్యాలలో ఈ ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మరోవైపు.. దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తపడుతున్నారు. ఘర్షణలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పా్టు చేశారు.