Baba Siddique: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Maharashtra minister Baba Siddique resigns from Congress: మహారాష్ట్ర కాంగ్రెస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండడంతో పాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ కూటమికి ఎదురులేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “నేను యుక్తవయసులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాను ఇది 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని ట్విట్టర్‌లో ప్రకటించారు.
Read Also: Congress: మోడీ సర్కారు పదేళ్ల పాలనపై కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’..!
Also Read
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీలో సిద్ధిక్ చేరతారని భావిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకులు చెప్పిన కొద్ది రోజులకే గురువారం నాటి పరిణామం జరిగింది. ఫిబ్రవరి 1న ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో సిద్ధిక్, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ భేటీ అయిన తర్వాత ఎన్‌సీపీ నేతలు ఈ ఊహాగానాలు చేశారు. బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధిక్ మాజీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై విభాగానికి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.సిద్ధిక్ 1999, 2004 మరియు 2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?