NTV Telugu Site icon

Puja Khedkar: యూపీఎస్సీ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్ పిటిషన్

Iaspujakhedkar

Iaspujakhedkar

ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా బుధవారం విచారణకు రానుంది. పూజా ఖేద్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డిబార్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 31న మోసం మరియు ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేద్కర్ యొక్క ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని UPSC తాత్కాలికంగా రద్దు చేసింది.

ఇది కూడా చదవండి: Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి

అందుబాటులో ఉన్న రికార్డులను యూపీఎస్సీ జాగ్రత్తగా పరిశీలించింది. సీఎస్‌ఇ-2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె దోషిగా తేలింది. దీంతో ఆమెకు షోకాజు నోటీసు జారీ చేసింది. ఆమె స్పందించకపోవడ్ంతో వేటు వేసింది. ఇదిలా ఉంటే పూజా ఖేద్కర్ ప్రస్తుతం ఇండియాలో లేనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాలకు పారిపోయినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆమె ఫోన్లు కూడా స్విచ్ఛాప్ వస్తున్నాయి. తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..