రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందినది తెలిసిందే. అయితే.. తాజాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేట్ చెందిన మహిళతో పాటు మరో మహిళ చికిత్స పొందుతూ నగరంలోని ఆసుపత్రిలో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. అయితే.. ముందస్తు చర్యగా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రత్యేక బలగాలు. ఇదిలా ఉంటే.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మృతి చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మమత, సుష్మ కుటుంబ సభ్యులకు 5 లక్షల నగదు, డబుల్ బెడ్ రూమ్, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే.. తాజాగా మరో ఇద్దరు మహిళలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ రోజు మృతి చెందిన వారికి సంబంధించి ఎక్స్ గ్రేషియా మరికాసేపట్లో జరిగే మీడియా సమావేశంలో ప్రకటించనున్న తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెల్లడించింది.
