NTV Telugu Site icon

Ex-Boyfriend Hacked Young Woman : కొచ్చిలో యువతిపై కత్తితో దాడి చేసిన మాజీ ప్రియుడు

Man Attack With Knife

Man Attack With Knife

Ex-Boyfriend Hacked Young Woman : మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో మహిళలపై గంటకో దాడి చోటు చేసుకుంటుంది. ఇందులో ప్రేమ పేరుతో జరిగే దాడులే ఎక్కువగా ఉన్నాయి. తనను కాదందన్న కోపంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా విచక్షణ కోల్పోయి దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కొచ్చి నగరం నడిబొడ్డులో బెంగాల్ కు చెందిన యువతి పై మాజీ ప్రేమికుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. మహిళను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read Also: Principal Arrest : విద్యార్థులతో ఆ పని చేయిస్తున్న ప్రిన్సిపల్ అరెస్ట్

ఈ సంఘటన కాలూరు ఆజాద్ రోడ్డులో ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. సంధ్య, ఆమె స్నేహితురాలు నడుచుకుంటూ వెళుతుండగా, మాజీ ప్రేమికుడు ఫరూక్ బైక్‌పై వచ్చి వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన చేతిలో ఉంచుకున్న కత్తితో సంధ్యను నరికి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెతో పాటు ఉన్న సంధ్య స్నేహితురాలు ఆమెను అడ్డుకుంది. ఈ క్రమంలో ఆమె చేయి తెగిపోయింది. గాయపడిన సంధ్యను ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు ఫరూక్ బైక్‌పై పరారయ్యాడు. తనను కాదని వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అక్కసుతోనే ఫరూఖ్ ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన సంధ్య కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.

Show comments