Site icon NTV Telugu

Bhadrachalam: సాయంత్రం హంస వాహనంపై విహరించనున్న సీతా రామచంద్రస్వామి..

Bhadrachalam

Bhadrachalam

శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని.. అందుకే ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందంటారు. చాంద్రామానం ప్రకారం కాకుండా.. సౌర మానం అనుసరించి సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో మార్గశిరం మాసం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు.

Read Also: Telangana: “భూభార‌తి”కి గ‌వ‌ర్నర్ ఆమోదం.. వీలైనంత త్వర‌గా అమ‌లులోకి

ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. రేపు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సీతా రామ చంద్రస్వామి వారికి.. ఈరోజు సాయంత్రం గోదావరిలో హంస వాహన సేవ కొనసాగనుంది. సాయంత్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకుంటాయి. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారి వేంచేసి.. గోదావరిలో విహరించుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు.. భక్తులు స్వామి వారి హంస వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Read Also:Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..

Exit mobile version