హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నియోజికవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 50వేల ఓట్లకు ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోంది.. సెప్టెంబర్ లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది.. నవంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకు ఎన్నికలకు సమాయత్తం కావాలి అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతీ బూత్ లెవల్లో 10మంది సభ్యులతో కలిసి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి.. ప్రతీ 100 ఓట్లకు కలిపి ఒక సమన్వయకర్తను నియమించుకోవాలి… ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను అని ఆయన అన్నారు.
Also Read : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..?
బాధ్యతతో పనిచేసే సమన్వయకర్తలకు నేను మొదటి ప్రాధాన్యతనిస్తాను అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాను ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉపయోగించుకోవాలి.. ప్రతీ బూత్ కు ఒక వాట్సప్ గ్రూప్ ఉండాలి అంటూ పేర్కొన్నారు. ఎన్నికలంటే కేవలం మద్యం, డబ్బే కాదు.. కేవలం వాటిని పంచడానికే ఇళ్ళకి వెళ్తున్నారు.. వారు బాగోగులు కూడా చూసుకోవాలి.. ఈ 150రోజులు నేను, పద్మావతి మీ మధ్యనే ఉంటాం అని ఉత్తమ్ అన్నారు. సాండ్, లాండ్, వైన్స్, మైన్స్, దోపిడీలో బీఆర్ఎస్ నాయకులు ముందుంటారు అని ఆయన వెల్లడించారు. నేను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా చేసినా.. అయినా ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదంటూ అన్నాడు. హుజూర్ నగర నియోజికవర్గంలో అన్ని గ్రామాలకు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించాను అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : సాగర తీరాన సారా అలీ ఖాన్ అందాల ఆరబోత