NTV Telugu Site icon

Etela Rajender : వర్గాలకు, కులలకు అతీతంగా వినాయక చవితి పండుగ

Etela

Etela

హైదరాబాద్ కూకట్ పల్లి IDL చెరువు వద్ద ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి నిమజ్జన ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు ఈటల రాజేందర్‌. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా వినాయక నిమజ్జనాలు జరుగుతాయన్నారు. చెరువుల్లో బేబీ పాండ్ లను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ లాంటి మురికి నీళ్లల్లో నిమజ్జనం చేయడం బాధాకరమన్నారు ఈటల రాజేందర్‌. ప్రభుత్వం ప్రత్యేకంగా వినాయకుల నిమజ్జనాల కోసం ఓ చెరువు నిర్మిస్తే బాగుంటుందని, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై ప్రతి ఏటా కోర్టుకు వెళ్లడం స్టే తెచ్చుకోవడం అలవాటు అయిపోయిందన్నారు ఈటల రాజేందర్‌. కలుషిత జలాలతో ఉన్న హుస్సేన్ సాగర్ లో కాకుండా, మంచి నీటిలో వినాయక నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. హుస్సేన్ సాగర్ కబ్జా చేసి ప్రసాద్ ఐ మాక్స్, జల్ విహార్ నించినట్లు, నిమజ్జనం కొరకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వర్గాలకు, కులలకు అతీతంగా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. నిమజ్జనంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, అన్ని చోట్ల భక్తులకు ఇబ్బందులు కాకుండా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్నారు.

 Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?

Show comments