Site icon NTV Telugu

Etela Rajender: గజ్వేల్ నుంచి ఓడిపోతాననే భయంతో కామారెడ్డికి వెళ్లిపోయారు

Etela

Etela

బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాలో రేపటి ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు.. గజ్వేల్ ప్రజలు నమ్మి ఓటేస్తే ప్రజల భూములు గుంజుకుంటున్నారు.. 50 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను అన్నారు.. నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదు.. గతంలో ఇచినవి గుంజుకున్నారు అని ఈటెల అన్నారు.

Read Also: Kishan Reddy: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు..

సీఎం కేసీఆర్ ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దు అని ఈటెల రాజేందర్ కోరారు. గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తాను అని గతంలో నేను చెప్పిన.. గజ్వేల్ ప్రజలు ఈ సారి కేసీఆర్ కు ఓటు వెయ్యం అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఓడిపోతానని భయపడి కామారెడ్డికి వెళ్లిపోయారు అని ఆయన అన్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం మందికి టికెట్ రాదని ప్రచారం జరిగింది.. కానీ భయపడి ఒకే సారి 115 మంది టికెట్లు ప్రకటించారు కేసీఆర్ అని ఈటెల తెలిపారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్లు చేశారు అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

Read Also: Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ ఎంపీ అధిర్‌ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ ఎత్తివేత

కేసీఆర్ ఇచ్చే హామీలు బోలెడు.. బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది BRS లోకి గుంజుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. కుక్కలాగా ఒర్రె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిల్లులను చేసినం అని ఓ ఎమ్మెల్సీ అంటున్నారు.. కాంగ్రెస్ వాళ్ళను ఏమనకండి వాళ్ళు మనవాల్లే అని ఇంకో ఎమ్మెల్యే అంటున్నారు.. వాళ్ళు మన కోవర్తులే మనమే గెలిపించి మన పార్టీలోకి తీసుకోస్తాం అంటున్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే ఇది ప్రజలు గమనించాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. కుటుంబ పాలన వద్దంటే బీజేపీ పార్టీకి ఓటేయండి అని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రేపు మనకి శుభోదయం.. బీజేపీకి గ్రాఫ్ బాగా ఉందని 119 నియోజకవర్గాల్లో పర్యటించిన మా ఎమ్మెల్యేలు చెప్పారు.. సమన్వయం ఉంటే ఇంకా ముందుకు వెళ్లొచ్చు అని వారు చెప్పారు అని ఈటెల వెల్లడించారు.

Exit mobile version