NTV Telugu Site icon

Etela Rajender : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు

Etela Rajender

Etela Rajender

BJP MLA Etela Rajender Addressed At BJP Bahiranga Sabha At Yadadri.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు దఫాలుగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి భువనగిరి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్య వ్యక్తి ఫోన్ చేసి బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పారని, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పితే.. వినాలనే చెబుతున్నానన్నారు అని ఆయన వివరించారు. కేసీఆర్ నీ వెన్ను నీకు కనబడటం లేదు… ప్రజలకు కనబడుతోందన్న ఈటల.. ఎనిమిదేళ్లకాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలన్నారు.

 

హుజురాబాద్ గడ్డపై యావత్తు తెలంగాణ ప్రజలతో బీజేపీ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారని, ఎక్కడా చూసిన కేసీఆర్ ను బొంద పెట్టే నినాదం వినిపిస్తోందన్నారు ఈటల రాజేందర్. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని, కాంగ్రెస్‌కు మూలమైన యూపీలోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించి పోయిందని, రాష్ట్రంలోని సర్పంచ్‌లు ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీలు బీజేపీలో చేరుతామని ఫోన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిన్నర కాలం ఉంది.. ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు వస్తామని అంటున్నారని ఆయన స్పష్టం చేశారు.