NTV Telugu Site icon

Etela Rajender : నేను చెప్పితేనే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశాడు

Etela Rajender

Etela Rajender

చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పెట్ లో బీజేపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణాలో బెల్ట్ షాప్ లు విచ్చల విడిగా వెలిశాయని ఆరోపించారు. బెల్ట్ షాప్ ల కారణంగా మహిళలు చిన్న వయసులోనే భర్తను కోల్పోతున్నారని మండిపడ్డారు. మద్యం మీద వచ్చే ఆదాయంపై ప్రభుత్వము ఆధారపడటం దురదృష్టకరమని, అలాంటి తెలంగాణ తెలంగాణ ప్రజలు కోరుకోవడంలేదని ఆయన అన్నారు. నా ఊరికి నేను రాకుండా నన్ను అడ్డుకున్నారని, వారికీ అధికారులు సహకరిస్తున్నారు.. రాబోయే రోజుల్లో సదరు అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మాట్లాడితే మునుగోడు సమస్యలు పరిష్కారము కావని, రాజీనామా చేస్తే ప్రజలకు కావాల్సినవి ఆన్ని వస్తాయి అని చెప్పిన, అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసారని ఆయన వివరించారు.

అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ… కేసిఆర్ కు 20 ఏళ్ళు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్ పై కేసులు పెట్టినడు కేసిఆర్, ఆయనను హుజూరాబాద్ ప్రజలు గెలిపించారు.. ఈటల రాజేందర్ ఇచ్చిన ధైర్యంతోనే రాజీనామా చేశాను… డబ్బుల కోసం 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారారు.. కానీ నేను మారలేదు… మంత్రులు తలసాని శ్రీనివాస్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ ఉద్యమకారులా… తెలంగాణలో పేదలకు వైద్యం అందడం లేదు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలబడాలి. మునుగోడు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే…. టీఆర్‌ఎస్‌, కేసిఆర్ ఇప్పుడు వంగి వంగి దండాలు పెట్టే అవసరం వచ్చేదా అని ఆయన వ్యాఖ్యానించారు.

 

Show comments