Site icon NTV Telugu

Etela Rajender : కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్

Etela Rajendar

Etela Rajendar

కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారని, కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఇవాళ రాజరాజేశ్వరి క్లస్టర్ లో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో రామాయంపేటలో ఈటల రాజేందర్, బోడిగ శోభ, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా అని యాన సవాల్‌ విసిరారు. ఫాయి కార్మికుల, వైద్యసిబ్బంది కాళ్ళు కడిగి కరోనాసమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. కేంద్రం ఇస్తే తప్ప ఇళ్లు కట్టలేడు రేవంత్ రెడ్డి, పెన్షన్ ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడన్నారు. అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే ఓట్లు వేసుకుందాం అన్నీ తెచ్చుకుందామన్నారు.

పదేళ్లుగా మోదీ గారు చేసిన పనులు చెప్పి మీ ఓటు అడిగేందుకు వచ్చామని, కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారన్నారు. నిరుద్యోగభృతి ఇవ్వలేదు, రుణమాఫీ చెయ్యలేదు,
డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని ఇవ్వలేదన్నారు. పెన్షన్లు, జీతాలు సరిగా ఇవ్వలేదని, ఇది తెలంగాణ ఆర్థిక దుస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసికూడా నాకు ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు. వికలాంగులకు 6 వేలు, ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా..’ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. . మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు, 15 వేల రైతుబంధు, 12 వేల కౌలు బంధు, వారికి 500 రూ. బోనస్ ఇలా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ అమలు చేయలేదు. కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్. రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా. సఫాయి కార్మికుల, వైద్యసిబ్బంది కాళ్ళు కడిగి కరోనాసమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఎరువుల మీద సంవత్సరానికి ఎకరానికి 18 వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నారు. 6300 కోట్లతో రామగుండం కర్మాగారం తెరిచి లైన్లు కట్టే బాధ తప్పించారు. నేషనల్ హైవేలు వేస్తున్నారు. 4 కోట్ల సొంత ఇల్లు ఇచ్చారు మోడీ. కేంద్రం ఇస్తే తప్ప ఇళ్లు కట్టలేడు రేవంత్ రెడ్డి, కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ ఇవ్వలేడు, కేంద్రం ఇస్తే తప్ప జీతాలు ఇవ్వలేడు అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే ఓట్లు వేసుకుందాం అన్నీ తెచ్చుకుందాం. మోడీ వచ్చాక.. జమ్మూ కాశ్మీర్ లో బుల్లెట్ గాయాలు లేవు. దేశంలో మతకలహాలు లేవు, బాంబుల మోతలు లేవు. భారత దేశానికి వచ్చిన గుర్తింపుకు కారణం నరేంద్ర మోడీ గారు అందుకే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం మళ్ళీ ఒకసారి ఆయన్ను ప్రధానిని చేసుకుందాం.’ అని ఈటల వ్యాఖ్యానించారు.

Exit mobile version