Site icon NTV Telugu

Etela Rajender : పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందట..!

Etela Rajendar

Etela Rajendar

పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది..గతంలో తనను కేసీఆర్ కోడితే .. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్టినట్లుగా పరిస్థితి మారిందని.. మరలా తన జోలికి వచ్చిన.. ఎగిరేగిరి పడిన వారిని అదే గతి తప్పదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సీటు ఆశించి బంగపడ్డ మల్క కోంరయ్య కుటుంబన్ని ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇన్నాళ్లు గా పార్టీని బలోపేతం చేయడానికి వారు చేసిన వర్క్ ను అభినందించడంతో పాటు తనకు పూర్తి సహాకరం అందించలంటూ కోరారు.. కాంగ్రెస్ మంత్రులు తమతో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నరంటూ చెప్పడం నవ్వు తెప్పిస్తుందని.. అలా ఐతే తమ కు టచ్ లో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నరంటూ బాంబు పేల్చినంత పనిచేశారు ఈటల రాజేందర్.. తమను కొట్టేవారే లేరని ప్రభుత్వలు అనవసర ఆలోచనలు చేస్తున్నయాని.. కానీ వారు చేసే పనులకు భవిష్యత్ లో పరిణమాలు ఇలానే ఉంటయంటూ.. కేసిఆర్, రేవంత్ రెడ్డి లకు ఝలక్ ఇచ్చినంత పనిచేశారు ఈటల రాజేందర్.

Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితులపై రూ. 20 లక్షల రివార్డ్..

Exit mobile version