Site icon NTV Telugu

Etela Rajender : సీఎం రేవంత్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల సవాల్

Etela

Etela

సీఎం రేవంత్ కు.. మల్కాజిగిరి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇద్దరం సెక్యురిటీ లేకుండా మూసీ పరివాహ ప్రాంతానికి వెళ్దామని, మూసీ పరివాహ ప్రాంత ప్రజలు నిన్ను శభాష్ అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని, ముక్కు నేలకురాసి క్షమాపణ చెబుతా అని ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ప్రజల చేత ఇంతగా తిట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు అని, గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారన్నారు ఎంపీ ఈటల. కడుపుమండి మాట్లాడిన పేదలను 5 వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారని, అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్ కు అధికారం నెత్తికెక్కిందని ఆయన మండిపడ్డారు.

  Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు..

మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ ? అని ఆయన ప్రశ్నించారు. నమామి గంగాకు 2 వేల 500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20 వేల కోట్లు ఖర్చు చేయలేదని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు ఎంపీ ఈటల. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయని, ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారన్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్న రేవంత్ లక్ష యాభై వేల కోట్లు ఎక్కడనుండి తెస్తున్నారని, కేసీఆర్ కూడా గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు ఎంపీ ఈటల. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారని, మోసం అబద్ధానికి మారుపేరు రేవంత్ అని ఆయన వ్యాఖ్యానించారు.

  ICC Womens T20: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌కు ఆ టీమ్‌లతో డేంజర్..!

Exit mobile version