Site icon NTV Telugu

Etela Rajender : ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవడం మంచి పరిణామమే..

Etela

Etela

తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అవడం మంచి పరిణామమేనని, విభజన సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు ఈటల రాజేందర్‌. ఉద్యోగుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదని, రెండు రాష్ట్రాల కు అవసరం అయ్యే విదంగా చర్చలు జరిగాలన్నారు ఈటల. మేము ఉద్యమ సమయంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే వాళ్లే అకారణంగా మా మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు.

 

ఇవాళ కౌన్సిల్ మీటింగ్ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు, పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. దీనికి ఇవాళ కౌన్సిల్‌లో జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇదే తరహాలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసి ప్రజాగ్రహానికి గురైందని, కాంగ్రెస్ కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈటల.

Exit mobile version