నిర్మల్ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కార్యక్రమానికి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. అయితే, ఈ సభను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ వచ్చాక కొత్తరూపం ఎత్తారు.. భూములు అమ్ముకొని బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారు.. జోన్ కన్వర్ట్ చెయ్యడం.. అసైన్డ్ భూములు లాక్కోవడం.. పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కేసీఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Singer Mangli : హద్దులు చెరిపేస్తున్న సింగర్ మంగ్లీ… షర్ట్ ముడేసి గుండెలు పిండేస్తోంది!
ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువచ్చేది ప్రతిపక్షాలు అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించేది మేము.. కానీ, కేసీఆర్ మాత్రం చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా వ్యవహరిస్తూ.. నేను యజమానినీ ప్రజలు జీతగాళ్లు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 5,800 ఎకరాలు పేదలకు ఇచ్చిన భూములు కేసీఆర్ లాక్కొన్నాడు. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని రోజు వార్తలు వస్తున్నాయి.. బడంగ్‌పేట్లో ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన భూములలో 24 ఎకరాల భూమి గుంజుకున్నారు. ఒక్కో ఎకరం 20 కోట్ల విలువ చేస్తుంది అని ఆయన ఆరోపించారు.
Read Also: Mahesh Babu: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..
కేసీఆర్ మాటలు తియ్యగా ఉంటాయి.. చేతలు ఇబ్బంది పెడుతున్నాయని బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నిర్మల్ లో పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు.. వచ్చినా కూడా పరిశ్రమలు పెట్టుకొనే వారు భూములు కొనుక్కుంటారు మీరెందుకు మధ్యలో.. రైతుల మీద జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు.. 2023 డిసెంబర్ వరకే మీకు అధికారాన్ని ప్రజలు అప్పగించారు.. నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.. నువ్వేం నిజాం సర్కార్ వు కాదు అని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు.. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే రెండు రోజుల ముందు, కేటీఆర్ వస్తే 24 గంటల ముందు, మంత్రులు వస్తే పొద్దున్నే ప్రతిపక్షాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తున్నారు అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Neha Shetty : ఆరెంజ్ డ్రెస్ లో మెరిసిన నేహా శెట్టి.. కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతుందిగా..
పౌరుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వంను గద్దె దించేందుకు ప్రజలందరూ ఐక్యం కావాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిర్మల్ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తాం.. నిన్ను ఎండగడతం.. నీ పార్టీని బొంద పెడతామని ఈటల హెచ్చరించారు. నిర్మల్ రైతులకి యావత్ తెలంగాణ అండగా ఉంటుంది అని నిర్మల్ గడ్డ మీద నుంచి ఈ ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
