Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Loss Benefit: ఈ రోజుల్లో ఎప్పుడు ఏమవుతుందో ఊహించడం చాలా కష్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంతోమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉద్యోగం పోయినవారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. అదే ఈఎస్ఐసీ (ESIC) అందిస్తున్న ‘అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన’ (ABVKY). ఈ పథకం కింద ఉద్యోగం ఊడిపోతే జీవితంలో ఒక్కసారి, ఏకంగా 90 రోజుల పాటు (3 నెలలు) మీ చివరి జీతంలో 50 శాతం మొత్తాన్ని నిరుద్యోగ భత్యంగా పొందవచ్చు. ఇటీవల లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ పథకం మాట్లాడుతూ.. ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తున్నందున దీని కాలపరిమితిని 2026 జూలై 1 నుంచి 2027 జూన్ 30 వరకు పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ అయ్యేలా అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నిజానికి ESI చట్టం 1948 లోని సెక్షన్ 2(9) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంక్షేమం కోసం 2018 జూలై 1న ఈ పథకాన్ని రెండేళ్ల ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఆరంభంలో కేవలం 25 శాతం జీతాన్ని మాత్రమే నిరుద్యోగ సహాయంగా ఇచ్చేవారు, కానీ ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. అయితే ఈ పథకం వర్తించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగం పోవడానికి ముందు ఆ ఉద్యోగి కనీసం ఒక సంవత్సరం పాటు ఉద్యోగంలో ఉండి, ఈఎస్ఐసీ పరిధిలో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే కనీసం 78 రోజుల పాటు ఈఎస్ఐసీ చందా చెల్లించి ఉండాలి. ఈ పథకం కోసం ఎలాంటి ప్రత్యేక ప్రీమియం కట్టాల్సిన పని లేదు. అలాగే విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ESI సభ్యులైన ఉద్యోగులు సహజంగానే దీనికి అర్హులవుతారు.
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ఉద్యోగం పోయిన 30 రోజుల తర్వాత ఈ నిరుద్యోగ భత్యం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ చివరి జీతం నెలకు రూ. 20,000 అనుకుంటే, మీకు మూడు నెలల పాటు నెలకు రూ. 10,000 చొప్పున లభిస్తాయి. క్లెయిమ్ చేయడం కూడా చాలా తేలిక. దీనికోసం ముందుగా esic.in పోర్టల్‌కి వెళ్లి ఎంప్లాయ్ సెక్షన్లో ‘ABVKY Eligibility’ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఇన్స్యూరెన్స్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఫోన్‌కి వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌తో పాటు అఫిడవిట్, గుర్తింపు కార్డు కాపీ, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసి దగ్గరలోని ESIC బ్రాంచ్ లేదా DCBO ఆఫీస్‌లో స్వయంగా గానీ, తపాలా ద్వారా గానీ అందజేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి. ఇక ఈఎస్ఐసీ సభ్యత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే, ఈ పథకం కింద నమోదైన ఉద్యోగి గరిష్ట జీతం నెలకు రూ. 21,000 మించకూడదు (దివ్యాంగులకైతే ఇది రూ. 25,000 వరకు ఉంటుంది). ESIC సభ్యత్వం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రతి నెలా మీ జీతం నుంచే 0.75 శాతం కట్ అవుతుంది. ఒకవేళ మీ దినసరి వేతనం రూ. 176 కంటే తక్కువగా ఉంటే ఆ చిన్న మొత్తాన్ని కూడా చెల్లించాల్సిన పని లేదు. ఈ నియమాలను పాటిస్తే ఉద్యోగం లేని ఆ మూడు నెలలు కుటుంబ పోషణకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!