NTV Telugu Site icon

Esha Gupta : ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్న హాట్ బ్యూటి..?

Whatsapp Image 2023 07 29 At 4.46.39 Pm

Whatsapp Image 2023 07 29 At 4.46.39 Pm

ఈషా గుప్తా.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన బోల్డ్ ఫోటోషూట్స్ తో హాట్ బ్యూటీ గా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.. సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో దిగిన ఫోటోలను ఫ్యాన్స్ కీ షేర్ చేస్తూ ఉంటుంది.తన టెంప్టింగ్ పోజులకు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అవుతూ వుంటారు. తన భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా అదరగొడుతుంది.ఇలా ఎప్పుడూ ఫిట్ గా కనిపించే ఇషా గుప్తా రీసెంట్ గా అనారోగ్యానికి గురైంది. ఆమె హాస్పిటల్ లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స పొందుతున్న పిక్ ని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కి షేర్ చేసింది.

దీనితో ఇషా గుప్తాకి ఏమైంది అని అభిమానులు అంతా కంగారు పడ్డారు.దానికి తాను హైపర్బెరిక్ థెరపీ చేయించుకుంటున్నట్లు ఇషా గుప్తా సోషల్ మీడియా పోస్ట్ లో చేసింది..దీనితో ఇషా గుప్తా చేసిన కామెంట్స్ ఆమె ఏదో అరుదైన వ్యాధితో భాదపడుతున్నట్లు గా తెలుస్తుంది.  నటి సమంత కూడా మాయొసైటీస్ వంటి అరుదైన వ్యాదికి గురైనప్పుడు ఇలాంటి థెరపీ తీసుకుంది.ఈ థెరపీ వల్ల కండరాల నొప్పులు, వాపు మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. దీనితో ఇదే తరహా ట్రీట్మెంట్ ఇషా గుప్తా కూడా తీసుకోవడం తో ఆమె కూడా సమంత తరహా లో కండరాల వ్యాధికి గురి అయ్యారని ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇషా గుప్తా పూర్తిగా అయితే ప్రస్తావించలేదు. మరీ ఈ భామ ను ఇలా ఆక్సిజన్ మాస్క్ లో చూసి ఫ్యాన్స్ ఎంతో అందోళన చెందుతున్నారు.ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Show comments