Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్ర దర్శకుడు. తన డైలాగ్స్‌తో, డైరెక్షన్‌తో హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. నిజానికి టాలీవుడ్‌లో ఆయన స్పీచ్‌లకు, డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టార్ డైరెక్టర్ కొడుకు.. తన తండ్రిని కాదని మరొక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. ఇంతకీ ఆ అగ్రదర్శకుడు ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో జెండా పాతిన సందీప్ రెడ్డి వంగా. ఒకప్పుడు రామ్‌గోపాల్ వర్మ తర్వాత అంతలా ఒక టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్‌కి వెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ కావడం సందీప్ రెడ్డి వంగాకే సాధ్యం అయ్యిందని పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’.
READ ALSO: Toxic Air Turns Deadly: ఢిల్లీలో ప్రతిరోజూ 25 మంది మృతి.. ప్రభుత్వం విడుదల చేసిన షాకింగ్ డేటా..
ఈ సినిమాకే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఇంకో సర్పైజ్ విషయం ఏంటంటే.. ఇదే సినిమాకు మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచిన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా థియేటర్స్‌కు రాకముందు నిర్వహించిన ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో రవితేజ తన కుమారుడు మహాధన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా మాస్ మహా రాజా మాట్లాడుతూ.. ‘నేను వాడికి ఏం చేయలి, ఏం చేయద్దని ఎప్పుడూ చెప్పలేదు. వాడే డిసైడ్ చేసుకుంటాడు’ అని చెప్పారు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర స్పిరిట్ సినిమాకు తన కుమారుడు, త్రివిక్రమ్ కుమారుడు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో రవితేజ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల వారసులు.. మహాధన్, రిషిల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
READ ALSO: Israel Earthquake: ఇజ్రాయెల్‌ను వణికించిన భూకంపం..
