Rahul Sankrityan: డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ – హీరో విజయ్ దేవరకొండలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా బాక్సిఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో ‘వీడీ 14′(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు. ఇంతకీ ఆ రిక్వెస్ట్స్ ఏమిటో తెలుసా.. ఈసారి పక్కగా తమ హీరోకు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ రౌడీ అభిమానులు డైరెక్టర్‌ను కోరుతున్నారు.
READ ALSO: Puppy Abuse Case: అరే ఏంట్రా ఈ దారుణం.. రెండు నెలల కుక్కపై యువకుడు లైంగిక దాడి..
తాజాగా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్.. తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ సోషల్ మీడియా వేదికగా హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌కు పంపించాడు. ఆ అభిమాని రిక్వెస్ట్‌కు స్పందించిన డైరెక్టర్ .. ‘మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..’ అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వీడీ 14 చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
READ ALSO: Donald Trump: అమెరికా అధ్యక్షుడిపై కాసుల వర్షం.. 12 నెలల్లో – 12 వేల కోట్లకుపైగా లాభం!
