Site icon NTV Telugu

Mega 158 Update: బాస్‌తో జోడి కట్టబోతున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!

Mega 158 Update

Mega 158 Update

Mega 158 Update: బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే బాస్ తన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ పనిలోపనిగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దుబాయ్‌లో మెగా 158 కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని టాక్. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌‌కి ప్రాధాన్యం ఉంటుందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో బాస్‌కు జోడిగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న టాలెంటెడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

READ ALSO: 360Hz టచ్ సాంప్లింగ్ రేట్, 3D ఫింగర్‌ప్రింట్ సెన్సర్.. 8.3mmతో Realme Neo 8 లాంచ్..

బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ భార్యగా ప్రియమణి కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో చిరుతో పాటు మరొక హీరో కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. ఆయనే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ హీరో కార్తీ. ఈ సినిమా కోసం కార్తీకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు గతంలో టాలీవుడ్ సర్కీల్‌లో జోరుగా ప్రచారం నడిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా, KVN ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

READ ALSO: Rahul Sankrityan: ‘ప్రామిస్.. మీ ఆకలి తీరుస్తా’! విజయ్ ఫ్యాన్‌కు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్రేజీ రిప్లై..

Exit mobile version